TG: అప్పులు, అవినీతిలో సీఎం రేవంత్ కేసీఆర్‌తో పోటీ పడుతున్నారని కేంద్ర మంత్రి, బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్‌రెడ్డి విమర్శించారు. అధికారంలోకి వచ్చిన 15 నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం రూ.1.52 లక్షల కోట్లు అప్పు చేసిందని అన్నారు. రేవంత్‌రెడ్డి ఎప్పుడు దిగిపోతారా అని ప్రజలు చూస్తుంటే మరోమారు తాను ముఖ్యమంత్రిని అవుతానని చెబుతున్నారని ఎద్దేవా చేశారు.