లూటీ లేదంటే లాఠీ లాగా రేవంత్ పాలన: హరీశ్

57చూసినవారు
లూటీ లేదంటే లాఠీ లాగా రేవంత్ పాలన: హరీశ్
రేవంత్ పాలన.. అయితే లూటీ లేదంటే లాటీ లాగా ఉందని BRS మాజీ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. రేవంత్ రెడ్డి వచ్చాక బతుకమ్మ చీరెలు, పిల్లల స్కాలర్‌షిప్‌ల పైసలు కూడా ఇవ్వడం లేదని విమర్శించారు. 'కేసీఆర్ ఇచ్చే రూ.2000 రెండు నెలలు ఎగ్గొట్టిండు. ముసలోళ్ల, దివ్యాంగుల పైసలు తిన్నడు రేవంత్ రెడ్డి' అని ఆరోపించారు. కేసీఆర్.. పింఛన్లు, కళ్యాణ లక్ష్మి, కేసీఆర్ కిట్టు, నీళ్లు, బతుకమ్మ చీరలు ఇలా అనేకం ఇచ్చాడని గుర్తుచేశాడు.

సంబంధిత పోస్ట్