మహిళలను వంచించిన రేవంత్ సర్కార్: హరీశ్

77చూసినవారు
మహిళలను వంచించిన రేవంత్ సర్కార్: హరీశ్
గ్యారెంటీలు, 420 హామీలు అని అన్ని వర్గాల ప్రజలను మోసం చేసినట్లే మహిళలను రేవంత్ సర్కారు దారుణంగా వంచించిందని మాజీ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. 'ఇందిరమ్మ రాజ్యంలో కేసీఆర్ కిట్టు బంద్ అయ్యింది. కేసీఆర్ న్యూట్రీషన్ కిట్ బంద్ అయ్యింది. బతుకమ్మ చీరెలు బంద్ అయినయి. ఆరోగ్య లక్ష్మీ బంద్ అయ్యింది. ఆరోగ్య మహిళ బంద్ అయ్యింది. పింఛన్ల పెంపు బంద్ అయ్యింది. యువతుల ఉద్యోగ కలల సాకారం ప్రశ్నార్థకమైంది' అని ట్వీట్ చేశారు.

సంబంధిత పోస్ట్