TGSRTCలోకి మహిళా సంఘాల అద్దె బస్సులు: సజ్జనార్

61చూసినవారు
'మ‌హిళా దినోత్స‌వం' నాడు TGSRTCలోకి మహిళా సంఘాల అద్దె బస్సులు రాబోతున్నాయని ఆ సంస్థ ఎండీ సజ్జనార్ ట్విట్టర్(X) వేదికగా తెలిపారు. 'తెలంగాణలోని ప్రతి మండల మహిళా సమాఖ్యకు ఒక్కో బస్సు చొప్పున కొనుగోలు చేసి, రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసికి అద్దెకు ఇస్తోంది. హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో ఇవాళ సాయంత్రం మ‌హిళా సంఘాల అద్దె బస్సుల‌ను CM రేవంత్ రెడ్డి ప్రారంభించ‌నున్నారు' అని సజ్జనార్ ట్వీట్ చేశారు.

సంబంధిత పోస్ట్