TG: నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని హైదర్శ కోట సన్ సిటీలోని ఓ అపార్ట్‌మెంట్ మొదటి అంతస్తులో షాకింగ్ ఘటన జరిగింది. ఓ దుండగుడు కాలింగ్ బెల్ కొట్టాడు. అనంతరం మహిళ డోర్ తెరవడంతో ఆమె మెడలోని నాలుగు తులాల బంగారు గొలుసును క్షణాల్లో ఎత్తుకెళ్లాడు. ఈ ఘటన మొత్తం అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డ్ కావడంతో నెట్టింట వైరల్ అవుతోంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.