ఉమ్మడి మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ పట్టభద్రుల టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి అర్హులైన ప్రతి ఒక్కరు ఓటరుగా నమోదు చేసుకోవాలని బుధవారం అందోల్ తహశీల్దార్ విష్ణు సాగర్ ఓ ప్రకటనలో కోరారు. 2021 నవంబర్ 1 నాటికి డిగ్రీ లేదా తత్సమానమైన విద్యను పూర్తి చేసిన వారు ఫారం-18 ద్వారా పట్టభద్రుల ఓటరుగా నమోదు చేసుకోవాలని తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు ప్రతిసారి ఓటరు లిస్టును కొత్తగా తయారు చేస్తారని పేర్కొన్నారు.