సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండలం కోర్పోల్ జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో ఆదివారం 2002-03 లో పదో తరగతి చదివిన విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఎన్నో సంవత్సరాల తర్వాత కలుసుకుని తమ అనుభవాలను ఒకరినొకరు పంచుకున్నారు. కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు, ఉపాధ్యాయులు రాజిరెడ్డి, అడివప్ప, అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.