ఆందోలు: నేడు పాఠశాలలో నల్ల బ్యాడ్జీలతో నిరసన
ఉపాధ్యాయులపై దాడులకు నిరసనగా సోమవారం పాఠశాలలో నల్లబ్యాడ్జీలతో ఉపాధ్యాయులు నిరసన తెలిపాలని ఎస్టియు జిల్లా అధ్యక్షుడు సాబేర్ అలీ ఓ ప్రకటనలో తెలిపారు. మహేశ్వరం మండలం తుక్కుగూడ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుని పై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని కోరారు.