జగదేవ్ పూర్ మండల వ్యాప్తంగా గ్రామంలో ఆదివారం ఉదయం నుంచే దట్టమైన పొగమంచు కమ్ముకుంది. ఇండ్లు, చెట్లు, వాహనాల పై మంచు తుంపర్లు కురిశాయి. పొగమంచు ధాటికి రోడ్ల పై ఏమి కనిపించకపోవడంతో వాహనదారులు హెడ్లైట్లు వేసుకుని ప్రయాణించారు. అలాగే ఇటీవల వరుసగా విద్యా సంస్థలు, కార్యాలయాలకు సెలవు రావడంతో చాలా మంది ప్రయాణం చేపట్టారు. కావున జాగ్రత్త తీసుకొని ప్రయాణించాలని పోలీసులు సూచించారు.