నెంబర్ ప్లేట్ లేని వాహనాలు సీజ్ చేసిన ఎస్సై

553చూసినవారు
నెంబర్ ప్లేట్ లేని వాహనాలు సీజ్ చేసిన ఎస్సై
సంగారెడ్డి జిల్లా ఆందోల్ నియోజకవర్గం రాయికోడ్ మండలంలో నేరాలను నియంత్రించేందుకు వాహనాల తనిఖీలు శనివారం నిర్వహించామని ఎస్సై వెంకట్ రెడ్డి తెలిపారు. నెంబర్ ప్లేట్ లేని 8 టూ వీలర్ వాహనాలను సీజ్ చేయడం జరిగింది. నెంబర్ ప్లేట్, కాగితాలు లేకున్నా అట్టి వాహనాలను సీజ్ చేసి ఆర్టీవో కి పంపించడం జరుగుతుందన్నారు. తప్పుడు నెంబర్ తో వాహనాలు నడుపుతూ దొంగతనాలకు, చైన్ స్నాచింగ్ లాంటి నేరాలకు పాల్పడుతున్నారని తెలిపారు.

సంబంధిత పోస్ట్