నారాయణఖేడ్ నియోజకవర్గం కంగ్టి మండల పరిధిలోని రాజారాంతాండలో శనివారం 286వ శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలు శ్రీ సేవాలాల్ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. తాండలో భవానీమాత మందిరము ముంగిట భోగ్ భండార్ కార్యక్రమం నిర్వహించి అన్నదానం కార్యక్రమం, బంజారా ఆటపాటలతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మందిరం పూజారి తాండ నాయక్. యువకులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.