గిరిజన గురుకుల పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని తహసీల్దార్ అబ్దుల్ నజీమ్ ఖాన్ అన్నారు. గురువారం కంగ్టి మండల కేంద్రంలోని గిరిజన గురుకుల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ.. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని అన్నారు. విద్యార్థులకు వడ్డించేదుకు అవసరమయ్యే సామాగ్రి విషయంలో నాణ్యమైన వస్తువులను కొనుగోలు చేసి భోజనాన్ని అందించాలన్నారు.