అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందజేయున్నట్లు ఎమ్మెల్యే సంజీవరెడ్డి పేర్కొన్నారు. శనివారం సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిషత్ కార్యాలయంలో 37మందికి కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్, 49 మందికి సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీలకతీతంగా అభివృద్ధి సంక్షేమమే దేహంగా పనిచేస్తున్నామని తెలిపారు.