ఎన్నికల సమయంలోనే రాజకీయాలు చేయాలి తప్ప అభివృద్ధిలో కలిసిమెలిసి పారదర్శకంగా పనిచేయాలని ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి అన్నారు. తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలో ఒకే రోజు 17 కోట్ల 82 లక్షల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయడం సంతోషంగా ఉందన్నారు. మున్సిపల్ అభివృద్ధికి భవిష్యత్తులోనూ అండగా నిలుస్తామని తెలిపారు. అభివృద్ధిలో ప్రతి ఒక్కరు భాగస్వాములు అయినప్పుడే సత్ఫలితాలు వస్తాయని అన్నారు.