వీధి కుక్కలతో పరేషాన్

74చూసినవారు
వేసవికాలంలో వీధి కుక్కల నియంత్రణ, కుక్కలతో ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించే విధంగా ప్రత్యేక దృష్టిని సాధించాలని జిన్నారం మండల ప్రజలు అధికారులను కోరుతున్నారు. వీధి కుక్కలు బాటసారులను, చిన్నారులను కరుస్తూ స్వైరవిహారం చేస్తుండడంతో ప్రజలంతా ఆందోళన చెందుతున్నారు. ప్రధాన వీధులు, ప్రభుత్వ కార్యాలయాల్లో సంచరిస్తూ ఎండలకు పిచ్చి పట్టినట్లుగా కరిచే ప్రమాదం కూడా పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్