వ్యవసాయ కార్మికులకు ఏడాదికి రూ 12, 000 ఇస్తామని ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీని అమలు చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి నర్సింలు డిమాండ్ చేశారు. సంగారెడ్డి లోని కేబుల్ కిషన్ భవన్ లో ఆదివారం సమావేశం నిర్వహించారు. వ్యవసాయ కార్మికులకు భూములు, ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరారు. ఉపాధి హామీ పథకాన్ని పకడ్బందీగా అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. సమావేశంలో నాయకులు పాల్గొన్నారు.