అన్ని వర్గాల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం అని మాజీ మున్సిపల్ చైర్మన్ సత్యనారాయణ అన్నారు. సదాశివపేటలో బుధవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వం అమలు చేయనున్న నాలుగు పథకాలకు సంబంధించి వార్డు సభల్లో జాబితా ప్రకటిస్తారని చెప్పారు. జాబితాలో పేర్లు లేకుంటే మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందుతాయని చెప్పారు.