తెలంగాణలో ప్రతిష్ఠాత్మకంగా జరుగుతున్న కులగణనకు జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి శనివారం సిబ్బందికి తగిన వివరాలను తెలిపారు. సంగారెడ్డి పట్టణంలోని కలెక్టర్ వారి నివాసంలో కులగణనకు వచ్చిన ఎన్యుమరేటర్లకు తమ కుటుంబ వివరాలను కలెక్టర్ తెలిపారు. కలెక్టర్ మాట్లాడుతూ.. కులగణనకు అందరూ సహకరించాలని సూచించారు.