మార్గశిర మాసం పౌర్ణమి పురస్కరించుకొని సంగారెడ్డి పట్టణం సోమేశ్వర వాడలోని పురాతన దాసాంజనేయ స్వామి దేవాలయంలో శనివారం హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహించారు. హనుమంతునికి తమలపాకలతో ప్రత్యేక పూజ కార్యక్రమాలను జరిపించారు. స్వామివారికి మహా నైవేద్యం, మంగళహారతి సమర్పించారు.