సంగారెడ్డి టౌన్-2 సబ్ స్టేషన్ పరిధిలోని బాలాజీ, సన్ రైస్ ఫీడర్ పరిధిలో చెట్లు నరికి వేస్తున్నందున ఈనెల 22వ తేదీన విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏఈ స్వామి గురువారం తెలిపారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు విద్యుత్ సరఫరా ఉండదని పేర్కొన్నారు. బాలాజీ నగర్, మంజీరా నగర్, నాలుగో తరగతి ఉద్యోగుల కాలనీ, అహ్మద్ నగర్, బర్మ కాలనీ, సన్ రైస్ ఆస్పత్రి ఏరియాలో విద్యుత్ కోత ఉంటుందని చెప్పారు.