అర్హులైన పేదలకు రేషన్ కార్డులు ఇవ్వాలని సీపీఎం జిల్లా కార్యదర్శి జయరాజ్ డిమాండ్ చేశారు. సీపీఎం రాష్ట్ర మహాసభల్లో భాగంగా సంగారెడ్డి పట్టణంలో గురువారం విరాళాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ పార్టీ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు అశోక్, సురేష్, సాయిలు పాల్గొన్నారు.