దత్త జయంతి మహోత్సవంలో భాగంగా సంగారెడ్డి మండలం ఫసల్వాదిలోని శ్రీ జ్యోతిర్వాస్య విద్యాపీఠంలో దత్తపాదుకార్చల ఊరేగింపు కార్యక్రమం శనివారం రాత్రి నిర్వహించారు. విద్యాపీఠం వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ డాక్టర్ శ్రీ మహేశ్వర శర్మ సిద్ధాంతి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. అనంతరం దత్త పాదుకల స్పర్శ కార్యక్రమాన్ని నిర్వహించారు.