చికిత్స పొందుతూ ఉపాధ్యాయుడి మృతి

9226చూసినవారు
చికిత్స పొందుతూ ఉపాధ్యాయుడి మృతి
కొండాపూర్ మండల పరిధి గంగారం ఉన్నత పాఠశాలలో గణిత ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న బి.ప్రవీణ్‌కుమార్‌(47) హైదరాబాద్‌లోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా గురువారం బ్రెయిన్‌డెడ్‌ అయి చనిపోయారు. ఈనాడు వెబ్ సైట్ కథనం ప్రకారం గంగారం ఉన్నత పాఠశాలలో ఆరు సంవత్సరాలుగా పనిచేస్తున్న ప్రవీణ్‌కుమార్‌ మూడు రోజుల క్రితం సంగారెడ్డిలోని తన నివాసంలో ఉన్న భార్య జ్యోతికి మూర్ఛ రావడంతో మందులు తీసుకురావడానికి గదిలోకి వెళ్లారు. అక్కడే గుండెపోటుతో కిందపడిపోయారు. అదేరోజు ఇద్దరినీ హైదరాబాద్‌లోని ప్రైవేటు వైద్యశాలకు తరలించగా భార్య ఆరోగ్యం కుదుటపడింది. గురువారం ఉదయం ప్రవీణ్‌కుమార్‌ బ్రెయిన్‌డెడ్‌ అయినట్టు వైద్యులు తెలపడంతో కుటుంబ సభ్యులు అవయవదానానికి అంగీకరించారు. శుక్రవారం సంగారెడ్డిలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్