ఝరాసంగం మండలం కుప్పానగర్ గ్రామంలో జిల్లా ఉద్యానవనశాఖ అధికారి సోమేశ్వరావు రైతులకు బుధవారం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆయిల్‌పామ్ పంట ద్వారా రైతులకు ఎకరాకు 50 మొక్కలు రాయితీపై ప్రభుత్వం ఇస్తుందని తెలిపారు.
దీర్ఘ కాలిక లాభాలు వచ్చే ఆయిల్‌పామ్ పంటను సాగు చేయాలని రైతులను కోరారు. కుప్పానగర్ శివారులో వెంకటేశం రైతు సాగు చేస్తున్న ఆయిల్ పామ్ పరిశీలించారు.