సస్పెక్ట్, కేడిల కదలికలపై నిరంతరం నిఘా ఉంచాలని ఎస్పీ రూపేష్ సూచించారు. జహీరాబాద్ పట్టణ పోలీస్ స్టేషన్ ను శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎస్పీ మాట్లాడుతూ గంజాయి అక్రమ రవాణపై ఉక్కు పాదం మోపాలని చెప్పారు. గంజాయికి అలవాటు పడిన నేరస్తులపై పిడి యాక్ట్ నమోదు చేయాలి. స్టేషన్ పనితీరు బాగుందని అభినందించారు. కార్యక్రమంలో పోలీసు అధికారులు పాల్గొన్నారు.