పటిష్టమైన కోటలను నిర్మించిన సర్వాయి పాపన్న

69చూసినవారు
పటిష్టమైన కోటలను నిర్మించిన సర్వాయి పాపన్న
ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రధానంగా రెండు కోటలను ఏర్పాటు చేశారు సర్దార్ సర్వాయి పాపన్న. ఖిలాషాపూర్‌లో నిర్మించిన కోటను రాజధానిగా ఏర్పాటు చేసుకొని జిల్లాలోని తాటికొండలో పటిష్టమైన కోటలను నిర్మించారు. సుమారు మూడు వందల అడుగుల ఎత్తైన కొండపై 13 అడుగుల వెడల్పైన కోట గోడలను నిర్మించి శత్రువులను ఎదిరించాడు. పాపన్న శివ భక్తుడు కావడంతో గుడిని సైతం నిర్మించాడు. నీటి అవసరాల కోసం మూడు అంచెల సెక్యురిటీ వ్యవస్థలో ఏడు కోనేరుల ఆనవాళ్లు ఇప్పటికి సజీవసాక్షిగా ఉన్నాయి.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్