మిరుదొడ్డి: రసాభాసగా మారిన గ్రామసభలు

66చూసినవారు
మిరుదొడ్డి: రసాభాసగా మారిన గ్రామసభలు
మిరుదొడ్డి మండలం ధర్మారం, అల్వాల గ్రామాల్లో గురువారం జరిగిన గ్రామసభల్లో రుణమాఫీ కానీ రైతులు అధికారులతో వాగ్వాదానికి దిగారు. రెండు లక్షల పైన ఉన్న వారికి రుణమాఫీ చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలం కావడం జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గృహ జ్యోతి పథకంలో భాగంగా అందాల్సిన విద్యుత్ సబ్సిడీ, గ్యాస్ పై సబ్సిడీ డబ్బులు రావడం లేదని గ్రామస్తులు వాపోయారు. గ్రామంలో ఏవైనా సమస్యలు తలెత్తిన పట్టించుకునే వారే కరువయ్యారన్నారు.

సంబంధిత పోస్ట్