భారత రాజ్యాంగ పరిరక్షణ సదస్సు 75 ఏళ్ల భారత రాజ్యాంగ ఉత్సవాల సందర్భంగా సోమవారం సిద్దిపేటలో నిర్వహించనున్నారు. డిబిఎఫ్ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ విలువల పరిరక్షణ ప్రచార ఉద్యమం నిర్వహిస్తున్నట్లు దళిత బహుజన ఫ్రంట్ జిల్లా ఉపాధ్యక్షుడు బ్యాగరి వేణు ఆదివారం తెలిపారు. సదస్సు టి.పి.టి.ఎఫ్ ఉపాధ్యాయ భవన్ లో ఉదయం 11 గంటలకు జరుగుతుంది.