సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని శ్రీరామ కోటి ఆలయం అద్దాల మండపంలో శనివారం దత్త పౌర్ణమి ఉత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. స్థానిక శ్రీ రామకోటి భక్తి సమాజం వ్యవస్థాపకులు భక్తి రత్న జాతీయ అవార్డు గ్రహీత రామకోటి రామరాజు ఆధ్వర్యంలో శ్రీ దత్తాత్రేయ స్వామికి పూజలు చేసి, భక్తిశ్రద్ధలతో భజనలు చేశారు. జగత్తులో శాశ్వతమైనది భగవన్నామస్మరణ ఒక్కటేనని రామకోటి రామరాజు ఈ సందర్భంగా పేర్కొన్నారు.