గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేసి నెలలు గడుస్తున్న కూలీలు వేతనం కోసం ఎదురుచూపు చూస్తున్నారని మంగళవారం దళిత బహుజన ఫ్రంట్ జిల్లా ప్రధాన కార్యదర్శి బ్యాగరి వేణు అన్నారు. ఈ సందర్భంగా గజ్వేల్ మండలం జాలిగామ గ్రామంలో పనిచేస్తున్న కూలీలతో వేణు మాట్లాడారు. నెలలు గడుస్తున్న చేసిన పనికి డబ్బులు రాక ఉపాధి హామీ పనికి వెళ్లడానికి కూలీలు నిరాకరిస్తున్నారన్నారు.