రుణమాఫీ విషయంలో రైతులకు ఇచ్చిన మాటను తప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే రాజీనామా చేయాలని మాజీ ఎఫ్డిసి చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం గజ్వేల్ పట్టణంలో స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే డిసెంబర్ 9న రైతు రుణమాఫీ చేస్తానని చెప్పిన రేవంత్ రెడ్డి మాట తప్పడన్నారు.