మల్లన్న సాగర్ భూ నిర్వాసితులకు ఇందిరమ్మ ఆత్మీయ భరొసా పధకాన్ని వర్తింపచేయాలని, నిర్వాసితుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం తగదని దళిత బహుజన ఫ్రంట్ (డిబిఎఫ్) జాతీయ కార్యదర్శి పి. శంకర్ అన్నారు. మల్లన్న సాగర్ భూ నిర్వాసితులకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఉపాధి హామి పధకం, అర్ అండ్ ప్యాకేజీని పూర్తి స్థాయిలో అమలు చేయాలని డిమాండ్ చేస్తూ దళిత బహుజన ఫ్రంట్ అధ్యక్షతన సోమవారం సిద్దిపేట జిల్లా కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు.