చెరువులో దూకి యువకుడి ఆత్మహత్య

5731చూసినవారు
చెరువులో దూకి యువకుడి ఆత్మహత్య
కుటుంబ కలహాలతో మనస్థాపం చెందిన యువకుడు చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటన వర్గల్‌లో గురువారం వెలుగు చూసింది. ప్రముఖ వెబ్ సైట్ కథనం ప్రకారం వర్గల్‌కు చెందిన చింతల యాదగిరి(35)కి 17 సంవత్సరాల క్రితం యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన మాధవితో వివాహం జరిగింది. వీరికి ఒక కొడుకు, కూతురు ఉన్నారు. వివాహమైన నాటి నుంచి దంపుతులు తరుచుగా గొడవ పడేవారు. కుల పెద్దల సమక్షంలో పలుమార్లు పంచాయితీలు కూడా నిర్వహించారు. అయినా కూడా గొడవలు సద్దుమణుగకపోవడంతో రెండు సంవత్సరాల క్రితం మాధవి పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో యాదగిరి మద్యానికి బానిసగా మారాడు. ఈ నెల 20న ఇంట్లో నుంచి వెళ్లిన యాదగిరి తిరిగి రాలేదు. గురువారం ఉదయం గ్రామ సమీపంలోని బ్రహ్మాన్ల పడిగే చెరువులో శవమై కనిపించాడు. యాదగిరి సోదరుడు చింతల తిరుపతి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గజ్వేల్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్