బాలికల వసతి గృహంలో మంత్రి పొన్నం సందర్శన

5176చూసినవారు
హుస్నాబాద్ మండల కేంద్రంలోని ప్రభుత్వ గిరిజన బాలికల కళాశాల వసతి గృహాన్ని బుధవారం బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. వసతిగృహంలో నెలకొన్న సమస్యలపై ఆరా తీశారు. విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై అడిగి తెలుసుకున్నారు. కాంపౌండ్ వాల్ లేక ఇబ్బంది పడుతున్నామని, నీటి సమస్య, వీధి దీపాల సమస్య ఉందని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. సమస్యలు పరిష్కరిస్తామని పొన్నం హామీ ఇచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్