ప్రియాంక గాంధీ రోడ్ షో రద్దు

65చూసినవారు
ప్రియాంక గాంధీ రోడ్ షో రద్దు
మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో జరిగే ప్రియాంక గాంధీ రోడ్ షో రద్దయినట్లు కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్ ఓ ప్రకటనలో తెలిపారు. మంగళవారం సీఎం రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో పట్టణంలో జనజాతర సభ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ సభకు నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. అయితే అనివార్య కారణాల వల్ల ప్రియాంక గాంధీ పర్యటన రద్దయిందని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్