మద్దూరు: పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయిక

69చూసినవారు
మద్దూరు: పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయిక
మద్దూరు మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలలో విద్యాభ్యాసం కొనసాగించిన 2009-10వ సంవత్సరం పూర్వ విద్యార్థులు ఆదివారం స్థానిక ఏ ఆర్ గార్డెన్లో ఆత్మీయ సమ్మేళనాన్ని ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా విద్యా బుద్ధులు నేర్పిన గురువులకు పాదాభివందనం చేసి పూలమాలలు, శాలువాలతో ఘనంగా సత్కరించారు. అనంతరం పాఠశాలలో విద్యాభ్యాసం చేసిన గత స్మృతులను పూర్వ విద్యార్థులు నెమరువేసుకుని ఆనందోత్సాహాలను పంచుకున్నారు.

సంబంధిత పోస్ట్