మల్లన్నసాగర్ లోకి రెండో దశ ఎత్తిపోతలు ప్రారంభం
మల్లన్నసాగర్ రిజర్వాయర్లోకి గోదావరి జలాల ఎత్తిపోతలను ఇరిగేషన్ అధికారులు మంగళవారం ప్రారంభించారు. సెప్టెంబరు 1 వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుందని మల్లన్నసాగర్ డీఈ చెన్ను శ్రీనివాస్ తెలిపారు. యాసంగికి నీరందించేందుకు రిజర్వాయర్లో 12 టీఎంసీల పైచిలుకు నీటిని నిల్వ చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అందుకనుగుణంగా నీటిని ఎత్తి పోస్తున్నారు. ప్రస్తుతం 10.30టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉంది.