నీటి కాలుష్యం వల్ల కలిగే దుష్ప్రభావాలు

589చూసినవారు
నీటి కాలుష్యం వల్ల కలిగే దుష్ప్రభావాలు
నివాసగృహాల నుంచి వెలువడే మురుగునీరు, జంతువుల మలమూత్ర విసర్జితాల నుంచి నీటిలోకి చేరే బ్యాక్టీరియా, సూక్ష్మజీవులు పేగు సంబంధమైన వ్యాధులను కలిగిస్తాయి. కలుషితమైన నీటిని తాగడం ద్వారా కలరా, డయేరియా, టైఫాయిడ్‌, పచ్చకామెర్లు సంభవిస్తాయి.
ఆర్సెనిక్‌ అనే భారలోహంతో కలుషితమైన నీటిని తాగడం వల్ల మూత్రాశయం, మూత్రపిండాలు, ఊపిరితిత్తులు, కాలేయం లాంటి అవయవాలకు సంబంధించిన క్యాన్సర్‌లు వచ్చే ప్రమాదం ఎక్కువ. శ్వాసకోశ సమస్యలు, పిల్లల్లో నరాల సంబంధిత వ్యాధులు వస్తాయి.

సంబంధిత పోస్ట్