రామడుగు నూతన బ్రిడ్జి ప్రారంభం

54చూసినవారు
రామడుగు నూతన బ్రిడ్జి ప్రారంభం
చిన్న కారణాలతో ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉన్న రామడుగు బ్రిడ్జిని గురువారం చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పచ్చ జెండా ఊపి ఘనంగా ప్రారంభించారు. నేటి నుండి సుమారు 50 గ్రామాల ప్రజలకు బ్రిడ్జి ద్వారా రాకపోకలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత పాలకులు కేవలం ఇద్దరు రైతులకు పరిహారం ఇప్పించలేక బ్రిడ్జి ప్రారంభం నోచుకోలేదని.. ఏళ్ల తరబడి నాలుగు మండలాల ప్రజలు రాకపోకలకు ఇబ్బంది పడ్డారన్నారు. సమస్య మీద గతంలో మేమే అనేకసార్లు పోరాటం చేశామని గుర్తు చేశారు.

సంబంధిత పోస్ట్