జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్య క్షేత్రం కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి వారిని బుధవారం జనగామ జిల్లా ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి రవీందర్ శర్మ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారిని ఆలయ పర్యవేక్షకులు గుండి హరిహరనాథ్ శాలువాతో సత్కరించారు. ఆలయ అర్చకులు ఆశీర్వదించి, తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో చెక్కిల్ల అశోక్, రమణారెడ్డి ఉన్నారు.