అంబేద్కర్ కూడలి వద్ద సోనియాగాంధీ 78వ జన్మదిన వేడుకలను సోమవారం ధర్మపురి శాసనసభ్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పిలుపు మేరకు మండల అధ్యక్షులు బుర్ర రాములు గౌడ్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్బంగా నాయకులు మాట్లాడుతూ AICC మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ తెలంగాణ ఏర్పాటులొ క్రియాశీల పాత్ర పోషించారని నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు వారి చిరకాల కోరికను నెరవేర్చారన్నారు.