నటుడు అల్లు అర్జున్ తప్పు చేశాడు కాబట్టే అరెస్ట్ చేసారని హుజురాబాద్ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ అల్లు అర్జున్ వల్ల ఒక ప్రాణం పోయిందని ఒక కుటుంబం చిన్నాభిన్నమైందని వెంకట్ వివరించారు. అల్లు అర్జున్ కనీసం స్పందించలేదని మండిపడ్డారు. తప్పు జరిగింది కాబట్టి స్టార్ అయినా పోలీసులు అరెస్ట్ చేశారని అన్నారు. ప్రతిపక్షాల తీరును ఎమ్మెల్సీ ఖండించారు.