చట్టాన్ని ప్రతి ఒక్కరూ గౌరవించాలి

63చూసినవారు
చట్టాన్ని ప్రతి ఒక్కరూ గౌరవించాలి
జగిత్యాల జిల్లాలో దసరా పండగను ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆకాంక్షించారు. శనివారం శమి పూజ జరిగే జంబిగద్దెను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా భద్రతాపరంగా తీసుకోవాల్సిన చర్యలపై పోలీస్ అధికారులకు పలు సూచనలు చేశారు. అవాంఛనీయ సంఘటనలు జరక్కుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. దుర్గామాతా నిమజ్జనాలను సామరస్యంగా జరుపుకోవాలన్నారు. చట్టాన్ని ప్రతిఒక్కరూ గౌరవించాలని.. అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్