భారతదేశంలో సమ సమాజ స్థాపన కోసం, అన్ని రంగాల్లో పనిచేస్తూ దోపిడీకి గురవుతున్న వర్గాలకు నిరంతరం సీపీఐ అండగా ఉంటుందని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి తెలిపారు. శుక్రవారం కరీంనగర్లో సీపీఐ జిల్లా కార్యవర్గ, కౌన్సిల్ సభ్యుల, గ్రామ శాఖ కార్యదర్శుల సమావేశం నిర్వహించారు. 2024 డిసెంబర్ 26తో సీపీఐ ఆవిర్భవించి 100వ సంవత్సరంలోకి అడుగుపెడుతుందని, శత జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలని ఆయన అన్నారు.