కరీంనగర్: నగరపాలక సంస్థ వార్డు ఆఫీసర్లకు ఓ రియంటేషన్ కార్యక్రమం

57చూసినవారు
కరీంనగర్: నగరపాలక సంస్థ వార్డు ఆఫీసర్లకు ఓ రియంటేషన్ కార్యక్రమం
కరీంనగర్ నగర పాలక సంస్థ సమావేశ మందిరంలో శనివారం నగరపాలక సంస్థ కమిషనర్ చాహత్ బాజ్పాయ్ ఆధ్వర్యంలో నూతనంగా నగరపాలక సంస్థ ఉద్యోగులుగా నియామకమైన వార్డు ఆఫీసర్స్ ఓరియంటేషన్ డే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నగర మేయర్ సునీల్ రావు హాజరయ్యారు. ఈ కార్యక్రమం రెండు రోజులపాటు కొనసాగనుంది. వార్డు ఆఫీసర్స్ నిర్వహించాల్సిన విధుల పట్ల వారికి దిశా నిర్దేశం చేశారు.

సంబంధిత పోస్ట్