తెలంగాణ రాష్ట్రంలోనే అత్యుత్తమమైన మార్కెట్ గా పద్మనగర్ సమీకృత మార్కెట్ ఉండబోతుందని నగర మేయర్ సునీల్ రావు అన్నారు. కరీంనగర్ నగరంలోని 16వ డివిజన్ పద్మనగర్లోగల సమీకృత మార్కెటు నిర్మాణ పనులను స్థానిక డివిజన్ కార్పొరేటర్ బోనాల శ్రీకాంత్ మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్పాయ్ తో కలిసి శనివారం పనులను పరిశీలించారు.