కరీంనగర్ జిల్లాలో ఆరోగ్య మహిళ కార్యక్రమం ద్వారా మహిళలకు నిర్వహిస్తున్న వైద్య పరీక్షలు నూరు శాతం పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి వైద్యశాఖ అధికారులను ఆదేశించారు. మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ, వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో శుక్రవారం సభ కార్యక్రమం నగరంలోని లక్ష్మీనగర్ లో గల కె. ఈ. ఎస్ గార్డెన్ లో జరిగింది. కలెక్టర్ హాజరై మాట్లాడుతూ గర్భిణీలకు నాలుగు ఆరోగ్య పరీక్షలు తప్పనిసరని సూచించారు.