మెట్ పల్లి పట్టణ మున్సిపల్ కార్యాలయంలో సోమవారం సమావేశ మందిరంలో సమగ్ర కుటుంబ సర్వే ఆన్లైన్ డాటా ఎంట్రీ కార్యక్రమాన్ని మున్సిపల్ కమిషనర్ టి మోహన్ పరిశీలించారు. డాటా ఎంట్రీ త్వరగా పూర్తి చేయాలని సిబ్బందిని కోరారు. ఈ కార్యక్రమంలో డి ఈ నాగేశ్వరరావు, మేనేజర్ వెంకటలక్ష్మి, ఏఈ, తదితరులు పాల్గొన్నారు.