రాజ్యాంగ గోడ ప్రతులను ఆవిష్కరించిన మెట్‌పల్లి డీఎస్పీ

75చూసినవారు
రాజ్యాంగ గోడ ప్రతులను ఆవిష్కరించిన మెట్‌పల్లి డీఎస్పీ
సుఖీభవ ఆర్గనైజేషన్ వ్యవస్థాపకుడు బొక్కెనపల్లి నాగరాజు ఆధ్వర్యంలో రాజ్యాంగ ప్రతిమతో పాటు గోడ పోస్టర్లను శనివారం పట్టణ డీఎస్పీ అడ్లూరి రాములు ఆవిష్కరించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. రాజ్యాంగ హక్కుల గురించి చేస్తున్న ప్రచారాన్ని అభినందిస్తూ, రాజ్యాంగం పట్ల ప్రతీ ఒక్కరూ అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ బత్తుల లక్ష్మణ్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్