జిల్లాలోని రామగిరి ఖిల్లాను పర్యాటకంగా అభివృద్ధి చేసేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. శుక్రవారం సమీకృత కలెక్టరేట్ లో అదనపు కలెక్టర్ అరుణశ్రీతో కలిసి రామగిరి ఖిల్లా అభివృద్ధిపై రివ్యూ నిర్వహించారు. రామగిరి ఖిల్లా చరిత్ర, ప్రాముఖ్యతపై కలెక్టర్ ఆరా తీశారు. ఈ సమావేశంలో జిల్లా అటవీ అధికారి శివయ్య, ఈఈ పంచాయతీ రాజ్ గిరిష్ బాబు, రామగిరి తహసిల్దార్ రాంచందర్ రావు పాల్గొన్నారు.